
చిత్ర పరిశ్రమలో అవకాశాలు వరుస కడుతున్న సమయంలోనే ఇతర ఆదాయ మార్గాలను వెతుక్కోవాలని, లేనిపక్షంలో కెరీర్ చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే వెండితెరకు పరిచయమై, గత 21 ఏళ్లుగా అగ్ర హీరోల సరసన నటిస్తూ తనదైన ముద్ర వేసిన తమన్నా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక క్రమశిక్షణ వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు.
తమ కెరీర్ ఆరంభం నుండి తండ్రి అందించిన మార్గనిర్దేశమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని తమన్నా పేర్కొన్నారు. “నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఆర్థిక వ్యవహారాలన్నీ మా నాన్నే చూసుకునేవారు. ఆయన నేర్పిన క్రమశిక్షణ వల్లే ఈరోజు నేను రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టగలిగాను. నటీనటులకు దూరదృష్టి చాలా అవసరం. చేతి నిండా పని ఉన్నప్పుడే సంపాదనను సరైన మార్గాల్లో మళ్లించాలి. లేదంటే చివరకు ఏమీ మిగలదు” అంటూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు..!!
