in

tamannah bhatia special bond with tollywood!

తాను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశానని, ఎన్నో నిర్మాణ సంస్థలతో పని చేశానని, కానీ ప్రత్యేక అనుబంధం సంపత్ నందితో ఏర్పడిందని అన్నారు. తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ఓదెల – 2 ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సంపత్ నంది, డి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎంతో మందితో పని చేసినా కొందరితోనే ఎవరికైనా ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందని అన్నారు. అలానే తనకు సంపత్ నందితో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు. ఆయన తనతో ఇప్పటికి నాలుగు సినిమాలు చేశారని, ఆయనకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ చిత్రం తమ కోసం కాకపోయినా సంపత్ నంది, మధు కోసం కచ్చితంగా విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. వారికి ఇది పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. .!!

 

junior ntr to go bald for ‘dragon’?

Nag Ashwin Went Into Depression After Watching Inception Trailer!