తమన్నా గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని తమన్నానే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ఇటీవల పలు ఈవెంట్స్, పార్టీలతో జంటగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు కూడా పెడుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోతున్నారని..తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని భావిస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తమన్నా పెట్టిన పోస్టుతో వీరు బ్రేకప్ అయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..
ప్రేమించడానికి రహస్యం ప్రేమించడమే అని నేను అనుకుంటున్నాను. సరదాగా ఉండడానికి రహస్యం..ఆసక్తికరంగా ఉండడమే. వేరే వాళ్లు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరే వాళ్లను అలా చూడాలి. ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్‌గా ఉండాలి అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టును తమన్నా తన ఇన్‌స్టాలో పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ కావడంతో తమన్నా విజయ్ వర్మతో విడిపోయిందా..? అంటూ రూమర్స్ మొదలయ్యాయి..!!