ఓదెల-2 సినిమాలో శివశక్తి పాత్ర చేయడం తన అదృష్టం అని తమన్నా చెప్పింది. ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ పనిచేస్తున్నారు. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని సంపత్ నంది, మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ భారీ అంచనాలు పెంచేసింది. ఈ నెల 17న రిలీజ్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను ముంబైలోని ఈవెంట్ లో రిలీజ్ చేశారు..
ఇందులో నాగసాధువుగా తమన్నా పాత్ర ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. హెబ్బా పటేల్, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, తదితరుల పాత్రలు ఇందులో కనిపించాయి. ఇక ఈవెంట్ లో తమన్నా మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉంది. సంపత్ నంది తీర్చిదిద్దిన వైనం అద్భుతంగా ఉంది. ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. ఇందులో నటన ప్రధానంగా కనిపిస్తుంది. ఈ మూవీ అందరికీ నచ్చతుంది’ అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ..!!