రీసెంట్ గా లవ్ మేకింగ్ సీన్స్ తో కూడిన హాట్ హాట్ వెబ్ సీరిస్ చేసింది. అరుణిమా శర్మ, హోమీ అదజనియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘జీ కర్దా‘లో ఆమె కీ రోల్ చేసింది. ఈ సీరిస్ మొన్నటి నుంచే స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సీరిస్ ఎలా ఉంది అనేదాని కన్నా ..ఎలా ఉండబోతోందనే చర్చే ఎక్కవ ఆసక్తిగా ఉందంటున్నారు. అందుకు కారణం తమన్నా హాట్ షోనే అనేది నిజం. ఈ క్రమంలో అనేక విమర్శలు వచ్చాయి. వాటికి తమన్నా సమాధానం చెప్పింది..ఈ సిరీస్‌లో బోల్డ్ సీన్స్ చాలా అవసరమని తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్‌ను చాలా న్యాచురల్‌గా చూపించే ప్రయత్నంలో ఈ సన్నివేశాలు తెరకెక్కించినట్టు వివరించింది. ఇది నచ్చినా నచ్చకపోయినా కథలో భాగంగానే చూడాలని పేర్కొంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే మరో వెబ్ సిరీస్‌లోనూ తమన్నా ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది. దీంతో కాంట్రవర్సీలతోనే పాపులారిటీ తెచ్చుకుంటోంది..!!