in

Tamannaah featuring in a special song for balayya!

ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో చేసిన ‘అఖండ-2’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు బాలయ్య. ఐతే, గోపీచంద్ మలినేనితో కూడా బాలయ్య ఓ మూవీ చేస్తున్నాడు. ఐతే, వచ్చే నెల మూడో వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు. ఈ సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి తమన్నా బాలయ్యతో ఎలాంటి స్టెప్స్ వేస్తోందో చూడాలి.

కాగా వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్‌ ఇది..!!

keerthy suresh turns to director!

37 years for LADIES TAILOR!