సూ పర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ సినిమాలో మరియు మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలలో ఆమె నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్షింపబడుతున్నాయి. కాగా జైలర్ సినిమాలో ముందు నుంచి తమన్నా హీరోయిన్ అంటూ చెప్పుకుంటూ వచ్చిన మూవీ టీం తీరా చూస్తే తమన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక భోళా శంకర్ సంగతి చూసుకుంటే జైలర్ కంటే ఈ సినిమాలో తమన్నా పాత్ర కాస్త మెరుగు అనే చెప్పాలి. స్క్రీన్ టైం ప్రకారంగా చూసుకుంటే కాస్తో కూస్తో జైలర్ సినిమాలో కంటే భోళా శంకర్ సినిమాలో ఎక్కువ టైం కనిపించిన ఆమె పాత్రకు మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది.
కేవలం రెండు, మూడు కామెడీ సీన్స్, మరియు పాటలకు మాత్రమే తమన్నా క్యారెక్టర్ పరిమితమైంది. ఇన్నిరోజులుగా తమన్నా ఈ రెండు సినిమాలతో నైనా మళ్ళీ టాలీవుడ్ లో బ్రేక్ వస్తుందనుకుంటే అలా జరిగేలా లేదు. ఈ ప్రకారంగా చూసుకుంటే జైలర్ సినిమా తీసిన నెల్సన్, భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఇద్దరి చేతిలో తమన్నా మోస పోయిందనే చెప్పాలి..ఇదే విషయంపై మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ ఇద్దరు డైరెక్టర్ల పైన తమ ఆగ్రహాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు..చూడాలి మరి భవిష్యత్తులో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఎలాంటి పాత్రలు వస్తాయో!!