టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్న ప్రేమలో ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓ వ్యక్తితో తరచుగా కారులో షికారు చేస్తూ మీడియా కంట పడింది. దీంతో అతనితో ఆమె ప్రేమలో ఉన్నట్లు పలు వెబ్ సైట్ లు కథనాలు కూడా రాశాయి. ఇప్పుడు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తమన్నా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నా కోస్టార్ గా అతనిని ఇష్టపడలేదు. తను చాలా స్పెషల్. ఒక వ్యక్తిలో నేను ఏ క్వాలిటీస్ అయితే ఇష్టపడతానో అవన్నీ అతనిలో ఉన్నాయి. తను నాకు రక్షణగా ఉంటాడు.
అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మా మధ్య మంచి సంబంధం ఉంది. నన్ను వెనక్కి లాగానే వారి నుంచి తను కాపాడతాడు. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తను హ్యాపీ ప్లేస్’ అని చెప్పింది. ఇంతకీ తమన్నా ప్రేమలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు విజయ్ వర్మ. నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’ సినిమాలో విలన్ గా నటించిన ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులే. విజయ్- తమన్నా కలిసి ‘లస్ట్ స్టోరీస్-2’ అని వెబ్ సిరీస్ లో నటించారు. అప్పటినుంచి వారి మధ్య పరిచయం ఏర్పడింది..!!