
మహిళల శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఐదేళ్లకు ఓసారి మార్పులు జరుగుతుంటాయని ప్రముఖ నటి తమన్నా భాటియా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించలేమని ఆమె వివరించారు. బరువు తగ్గేందుకు ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పదిహేనేళ్ల వయసు నుంచే తాను నటిస్తున్నానని తెలిపారు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, సినిమాల్లోని పాత్రల కోసం ఒక్కోసారి బరువు పెరగడం, మరోసారి తగ్గడం చేయాల్సి వస్తుందని తమన్నా వివరించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చానని, కెమెరాతో తన ప్రయాణం సాగుతోందని చెప్పారు. ఇందులో దాచిపెట్టడానికి ఏమీలేదన్నారు..!!
