చాలా మంది సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాల విషయానికి వస్తే మౌనంగా ఉండటానికి ఎందుకు ఇష్టపడతారో తమన్నా కూడా ప్రస్తావించింది. తరచుగా తనను జడ్జ్ చేస్తారన్న భయమే కారణమని చెప్పింది. సినిమాల్లో ఉన్న వ్యక్తులపై చాలా రకాలుగా అంటారని తెలిపింది. ఆజ్ కీ రాత్ సాంగ్ సమయంలో తమన్నా తన శారీరక సౌష్టవాన్ని ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో ఈ సందర్భంగా వెల్లడించింది. “కావాలా, ఆజ్ కీ రాత్ టైమ్లో ఆడియన్స్ నేను చాలా లావుగా ఉన్నానని అనుకున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం, నేను చాలా సన్నగా ఉన్నాను” అని తెలిపింది.
మరోవైపు, మొటిమలతో ఇబ్బంది పడే వారికోసం సహజ సిద్ధమైన చిట్కా గురించి ఇటీవల మరో ఇంటర్వ్యూలో పంచుకుంది. మొటిమలకు ఉదయపు ఉమ్మి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పింది. ఉమ్మితో మొటిమలను నివారించుకోవచ్చని, అంటే ముఖ్యంగా ఉదయాన వచ్చే ఉమ్మితో పింపుల్స్ సమస్య నుంచి ఎంచక్కా బయటపడొచ్చని పేర్కొంది. అలాగే దీని వెనక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉందంటూ వివరించింది. తాను నేను 24, 25 ఏళ్ల వయసు నుంచే చర్మ సంరక్షణ కోసం శ్రద్ధ తీసుకుంటున్నానని తెలిపింది.యాంటీ ఏజింగ్ క్రీమ్‌లను ఉపయోగించడం మంచిదని పేర్కొంది..!!