
రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్’ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. సినిమా కథతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల్లో ఎక్కువగా చర్చకు వచ్చిన పాట “శరరత్”. ఈ పాట గురించి తాజాగా బయటకు వచ్చిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్‌లో మొదటిగా స్టార్ హీరోయిన్ తమన్నా పేరు పరిశీలనలోకి వచ్చిందని సమాచారం. అయితే ఈ విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఒక ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ మాట్లాడుతూ, “శరరత్” పాటకు తమన్నాను ఎంపిక చేస్తే బాగుంటుందని నేను సూచించినప్పటికీ, దర్శకుడు మాత్రం ఇందుకు అంగీకరించలేదని వెల్లడించారు..!!
