in

Tamannaah Bhatia special song in chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందు పంచడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది..

ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని, అందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో తమన్నా స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆమె నటించిన ‘కావాలయ్య’, ‘డా డా డాస్’ వంటి పాటలు షేక్ చేశాయి. ఇప్పుడు అదే జోరుతో చిరంజీవి సినిమాలో కూడా మాస్ ఆడియన్స్‌కు అదిరిపోయే కిక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పాట కోసం చిత్ర యూనిట్ భారీ సెట్‌ను నిర్మించి, గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోందట.!!

Rukmini Vasanth Warns Fans Against Impersonation, Cites Cybercrime!

Rashmika Mandanna: I would want to do a Korean drama