రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో కూడా బుచ్చిబాబు ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం కిరాక్ హీరోయిన్ ను రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందులు వేయబోతున్న ఆ బ్యూటీ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు.. రామ్ చరణ్ సరసన రచ్చ సినిమాలో నటించిన ప్రేక్షకులను సందడి చేసిన నటి తమన్న తిరిగి చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం..!!