in

Tabu to romance Nagarjuna after a long wait!

నాగార్జున, టబు అనగానే మనకు గుర్తొచ్చేది ‘నిన్నే పెళ్లాడుతా’. ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ‘ఆవిడ మా ఆవిడే’లోనూ ఈ జోడీ అలరించింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత, దాదాపు 27 ఏళ్ల విరామం అనంతరం తన 100వ సినిమా కోసం ఈ క్లాసిక్ జోడీ జతకట్టబోతోంది. ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ..టబు నాకు ఆమె కెరీర్ ప్రారంభం నుంచే తెలుసు. నా 100వ సినిమా గురించి తెలియగానే, తను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఎంతో ఆశపడింది అని క్లారిటీ ఇచ్చారు. ఇందులో టబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం..

తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ‘కింగ్’ నాగార్జున 100వ సినిమా కావడంతో టైటిల్ విషయంలోనే సెన్సేషన్ మొదలైంది. ప్రస్తుత సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ , భారీ గ్రాఫిక్స్ రాజ్యమేలుతున్నాయి. కానీ నాగార్జున మాత్రం ఈ విషయంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్‌పై ఆధారపడకుండా, ఒళ్లు గగుర్పొడిచే ‘రియలిస్టిక్ యాక్షన్’ సీక్వెన్స్‌లపై ఫోకస్ చేస్తున్నారు..!!

Ranveer Singh-Boyapati Srinu Film: Is the Deal Locked?

Boyapati Srinu Bollywood Entry with Ranveer Singh!

Sreeleela to star opposite Dhanush in Rajkumar Periasamy film!