టబు ఓ ఇంటర్వ్యూలో మగవారు గురించి బోల్డ్ కామెంట్స్ చేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌కు చెందిన కొన్ని వెబ్‌సైట్స్ ఈ విషయాన్ని ప్రధానంగా పబ్లిష్ చేశాయి. తనకు పెళ్లిపై ఆసక్తి లేదని, బెడ్‌పై ఒక మగాడు మాత్రమే కావాలి అంటూ కామెంట్స్ చేసిందని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై టబు టీమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ విషయమై టబు కూడా నేరుగా స్పందించారు..
తాను అలాంటి వ్యాఖ్యలు అస్సలు ఎప్పుడూ చేయలేదంటూ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే టబు యూనిట్ సైతం ఈ వార్తలపై స్పందించింది. ‘పలు వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ టబు పేరుతో కొన్ని అవమానకరమైన, అసభ్యకరమైన తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. ఆమె ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని మేం స్పష్టం చేయాలనుకుంటున్నాము.అభిమానులను తప్పుదారి పట్టించడం తీవ్రమైన ఉల్లంఘన. ఈ వెబ్‌సైట్‌లు తక్షణమే క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అంటూ ప్రకటనలో విడుదల చేశారు..!!