తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంది. మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో, దొంగాట, ఆనందో బ్రహ్మ శ్రీ వంటి సినిమాలలో నటించింది. ఇందులో కొన్ని సినిమాలు మినహా మిగతావి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటుంది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది తాప్సి..ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలామంది హీరోలు, దర్శకులు ఫోన్ చేసి మరీ అర్ధరాత్రి వారి గెస్ట్ హౌస్ కి రమ్మన్నారట. దీంతో తాను అలాంటి దాన్ని కాదని చెప్పినా కూడా వినకుండా ఫోన్లు చేసి విసిగించేవారట. అంతేకాకుండా ఓ ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని ఎంతో కాలం వేధించారని.. వారి మాట వినకుంటే సినిమాలలో అవకాశాలు రాకుండా చేస్తామని కూడా బెదిరించారట. కానీ ఆ బెదిరింపులను సీరియస్ గా తీసుకోకుండా తన కష్టాన్ని నమ్ముకుని సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దీంతో తాప్సీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి..!!