in

Taapsee Pannu recalls embarrassing demands to wear padded bras!

క్షిణాది ఇండస్ట్రీలో షూటింగ్ టైంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు తాప్సీ. ‘గ్లామర్ సీన్స్, సాంగ్స్‌కు సంబంధించి మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని చెప్పేవారు. ఫిల్మ్ మేకర్స్ అలా ఒత్తిడి చేసే వారు. షూటింగ్ సెట్‌లో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎలా అసౌకర్యంగా ఉంటాయో ఓ మహిళగా నాకు తెలుసు. ఏదైనా సాంగ్స్ చేస్తున్నప్పుడు అందరూ గమనిస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.’ అంటూ కామెంట్స్ చేశారు..

అంతే కాకుండా సౌత్, భోజ్‌పురి సినీ ఇండస్ట్రీల్లో పాటల్లో ఎక్కువగా నాభిపై ఫోకస్ చేస్తుంటారని చెప్పారు తాప్సీ. ‘హీరోయిన్ల నాభిపై ఎక్కువగా దృష్టి పెడతారు. అసలు ఫోకస్ ఎక్కువగా అక్కడ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. హిందీ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో నాభిపై ఫోకస్ ఉండదని నేను చెప్పడం లేదు. అయితే, సౌత్ సినిమాల్లో ఉన్నంతగా ఉండదని మాత్రం నేను చెప్పగలను.’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలోనూ సౌత్ పరిశ్రమపై తాప్సీ చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. సౌత్ మూవీస్‌లో నటించడం వల్ల తనకు గుర్తింపు రాలేదన్నారు. స్టార్ హీరోయిన్‌గా కొనసాగినా సంతృప్తి అనిపించిన క్యారెక్టర్స్ రాలేదని అన్నారు..!!

Age gap between Vijay Deverakonda and Rashmika Mandanna!

Venkatesh and Kalyan Ram to star in Anil Ravipudi’s next!