దగ్గుబాటి రానా తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమయిన గుర్తింపు ఉన్న నటుడు, అంతే కాదు ఇండస్ట్రీ లో ఎక్కువ మంది స్నేహితులు ఉన్న వ్యక్తి, చక్కటి భోజన ప్రియుడు, కొంత చిలిపివాడు కూడా. రానా ఎంతటి భోజన ప్రియుడు అంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టి, జంటనగరాలలో ఎక్కడ ఏ నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుందో చెప్పగల నోటోరియస్ ఫుడ్డి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఫ్రెండ్స్ దగ్గర, అప్పుడప్పుడు తమ మాస్టర్ దగ్గర కూడా అప్పులు చేసి స్కూల్ కి బంక్ కొట్టి సిటీ లో ఉన్న రెస్టారెంట్స్ అన్ని తిరిగి నాన్ వెజ్ ఫుడ్ తినటమే పని. తిరిగి ఆ అప్పులు తీర్చటానికి వాళ్ళ మమ్మీకి ఎన్ని స్టోరీలు, స్క్రీన్ ప్లే లు చెప్పవలసి వచ్చేదో పాపం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రోజుల నుంచి రాంచరణ్, శర్వానంద్ ఇతనికి మంచి స్నేహితులు. రానా, రాంచరణ్ తో కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి రాత్రి పూట చిరంజీవి గారి ఇంటికి వచ్చే రానా, ఏమి చేసే వాడో చిరంజీవి గారే ఒక సందర్భం లో చెప్పటం జరిగింది.
చదువుకోవటానికి అని రోజు రాంచరణ్ దగ్గరకు వచ్చేవాడట,ఇద్దరు రూమ్ లో దూరి తలుపేసుకొనేవారట. పాపం బిడ్డలిద్దరు గదిలో బుద్ధిగా చదువుకుంటున్నారు అనుకొనే వారట చిరంజీవి గారు, వారి కుటుంబ సభ్యులు, కానీ పొద్దు పోయాక ఆ రూమ్ కిటికీ గ్రిల్ తీసేసి వీరిద్దరూ బయటకు జంప్, జాలీ గ టైం స్పెండ్ చేసి తిరిగి రూమ్ లోకి వచ్చి గ్రిల్ ఫిక్స్ చేసేసేవారట. బహుశా ఏ షాదాబ్ కో, షా గౌస్ కో , లేకుంటే నయాగరా కో పోయి పరోటా, పాయ, లేకుంటే రోటి, కిడ్నీ,ఖీమా మసాలా లాగించేసి వచ్చి ఉంటారు. వీరిద్దరూ బుద్ధిగా చదువుకుంటున్నారు అనుకుంటున్నా చిరంజీవి గారికి చాల కాలం తరువాత, అంటే రెండు మూడు నెలల తరువాత గాని అనుమానం రాలేదు, రూమ్ తెరిచి చూస్తే ఈ జంప్ జిలానీల బండారం బయట పడిందట..!!