రీసెంట్‌గా వచ్చిన నితిన్ ‘తమ్ముడు’ మూవీలో నెగిటివ్ రోల్‌లో తన నటనతో ఆకట్టుకున్నారు మలయాళ హీరోయిన్ శ్వాసిక. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో ఆమెకు ఆఫర్ రాగా దాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. లేటెస్ట్ మలయాళ మూవీ ‘వాసంతి’ ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. తమిళ మూవీ ‘లబ్బర్ పందు’లో హీరోయిన్ తల్లిగా నటించి మెప్పించారు శ్వాసిక..
ఆ పాత్రలో విపరీతమైన క్రేజ్ రాగా..తనకు వరుసగా అలాంటి ఆఫర్సే వచ్చాయని చెప్పారు. ‘లబ్బర్ పందు మూవీలో మదర్ రోల్‌కు మంచి పేరు రావడంతో చాలామంది దర్శకులు వరుసగా మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. 33 ఏళ్ల వయసులో ఈ రోల్స్ కరెక్ట్ కాదని నాకు అనిపించింది. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలోనూ హీరో తల్లి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. ఒకవేళ ఆ మూవీలో ఆ రోల్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ప్రస్తుతానికి అలాంటి రోల్స్ చేయాలని నాకు లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఛాన్స్ వస్తే ఆలోచిస్తా.’ అంటూ చెప్పారు..!!