బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్‌కు లాస్ ఏంజెల్స్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ క్యాబ్ డ్రైవర్ చేసిన పనికి ఆమె తన అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. స్వర ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. అక్కడ ఆమె షాపింగ్ చేశారు. అనంతరం తన ఉండే చోటుకు వెళ్లేందుకు ఒక క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ బాలీవుడ్ బ్యూటీకి అనుకోని షాక్ ఇచ్చాడు. ఆమె షాపింగ్ చేసిన వస్తువులను దొంగిలించి హీరోయిన్ను ఖంగుతినేలా చేశాడు.
ఈ అనుకోని పరిణామానికి స్వర భాస్కర్‌కు ఎలా స్పందించాలో అర్థంకాక ఆ డ్రైవర్ చేసిన పనిని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. “హే @Uber_Support నేను లాస్ ఏంజిల్స్‌లో ప్రీ యాడెడ్ స్టాప్‌లో ఉండగా, మీ డ్రైవర్లలో ఒకరు అతని కారులో నా కిరాణా సామాగ్రి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. మీ యాప్‌లో దీన్ని రిపోర్ట్ చేయడానికి మార్గం లేదు. ఇది పోగొట్టుకున్న అంశం కాదు! అతను ఇప్పుడే తీసేసుకున్నాడు. దయచేసి నేను నా వస్తువులను తిరిగి పొందవచ్చా?”
అంటూ ఉబెర్ యాజమాన్యానికి తన గోడును బాలీవుడ్ హీరోయిన్ వెళ్లబోసుకుంది. అయితే, ఆమె ట్వీట్‌కు వెంటనే స్పందించిన ఉబర్ సపోర్ట్ ఈ తప్పును సరిదిద్దడంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. మన దేశంలోనే కాదు దేశం కానీ దేశం వెళ్లినా సామాన్యులతో పాటు సెలెబ్రెటీలకు కూడా టూరిస్ట్ కష్టాలు తప్పవనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఇక ఆ ఉబర్ డ్రైవర్ స్వర వస్తువులను పొరపాటుగా తీసుకెళ్లాడా ? లేదంటే కావాలనే దొంగతనం చేశాడా..? తెలుసుకోవాల్సిన బాధ్యత ఉబెర్ యజమాన్యానిదే..!