in

Sushmita Sen Confirms Break Up With Rohman Shawl!

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తన ప్రియుడి రోహ్మాన్ షాల్‌ తో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2018లో రోహ్మన్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన సుస్మిత.. తాజాగా తన మూడేళ్ల బంధంకు గుడ్ బై చెప్పారు. మేము ఫ్రెండ్స్‌గా పరిచయం అయ్యాం, ఫ్రెండ్స్‌లానే ఉండిపోతున్నాం, మా బంధం ఎప్పుడో తెగిపోయింది అని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ప్రియుడి లవ్‌‌కి బ్రేకప్ చెప్పిన సుస్మితా సేన్ ప్రస్తుతం సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటివరకు ఎక్కడికి పోయినా రోహ్మాన్ షాల్‌తో కనిపించే సుస్మితా సేన్ ప్రస్తుతం ఒంటరిగానే కనబడుతున్నారు.

జిమ్‌లో కష్టపడుతూ, కొత్త ప్రదేశాలను తిరుగుతూ సింగల్ లైఫ్ మొదలెట్టారు. మరోవైపు బ్రేకప్ అనంతరం స్నేహితులతో కలిసి సుస్మితా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. పబ్, రెస్టారెంట్‌లకు వెళుతూ సింగల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ‘పీస్ ఈజ్ బ్యూటీఫుల్’ అంటూ తాను మాత్రమే ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ‘సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సుస్మితా’, ‘ప్రియుడిని వదిలించుకుని పార్టీలు చేసుకుంటున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ts congress leader addanki dayakar turns as a cinema hero!

‘master’ beauty Malavika Mohanan at IIFA Green Carpet!