in

surprise, Nani blocks 7 release dates for ‘Ante Sundaraniki’!

రోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అనుకున్న రిలీజ్ డేట్ కు ఏవీ కూడా రిలీజ్ కావట్లేదు. అయితే ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక్కో సినిమా రెండు రెండు రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే నాని కూడా అంటే సుందరానికి సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. అయితే కాస్త వెరైటీగా మొత్తం 7 రిలీజ్ డేట్ లను ప్రకటించాడు. మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా.. ఫుల్ ఆవకాయ సీజన్ ని బ్లాక్ చేసాం. మెల్లగా డిసైడ్ చేద్దాం అంటూ ఏప్రిల్ 22, 29 లేదా మే 6, 20, 27 లేదా జూన్ 3,10 తేదీలను ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు .వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్నారు.

Telugu Heroine Shruti Sodhi Latest Glamorous Photos!

character artist pragathi shocking comments on casting couch!