in

Suriya straight Telugu film with lucky bhaskar director Venky Atluri

రైటర్‌గా పనిచేసిన వెంకీ అట్లూరి తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. 2023లో వచ్చిన సార్‌ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన లక్కీ భాసర్‌తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. దీంతో వెంకీ అట్లూరి రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం వెంకీ అట్లూరి ఓ స్టార్‌ హీరోతో సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

తమిళ స్టార్‌ హీరో సూర్యతో ఓ సినిమాను చేయనున్నట్లు సమాచారం. సూర్య ఇప్పటి వరకు స్ట్రెయిట్‌ మూవీ చేయలేదు. అయితే ఇటీవల తనకు తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేయాలని కోరిక ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. మంచి క‌థ దొరికితే చేస్తాన‌ని చాలా సినిమా ఈవెంట్‌ల‌లో వెల్ల‌డించారు. తాజా సమాచారం ప్రకారం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది..ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం..!!

Balakrishna gifts Porsche car to music director Thaman!

ravi teja beauty Bhagyashri Borse Gets Another crazy Offer!