
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇప్పుడు మరో తెలుగు సినిమా పై సంతకాలు చేశాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘గీత గోవిందం’తో పెద్ద హీరోల దృష్టిలో పడిన దర్శకుడు పరశురామ్. ఆ తరవాత మహేష్ బాబు తో `సర్కారు వారి పాట` రూపొందించాడు. ఈ చిత్రం కమర్షియల్ గా బాగానే ఆడింది. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తీసిన ‘ఫ్యామిలీ స్టార్’ నిరుత్సాహపరిచింది..
అప్పటి నుంచీ పరశురామ్ కొత్త సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. కార్తీ కోసం ఓ కథ రాసుకొని, కొంతకాలం ప్రయత్నాలు చేశాడు. కానీ కుదర్లేదు. ఇప్పుడు అన్నయ్య సూర్య దగ్గరకు వెళ్లాడని సమాచారం. సూర్య – పరశురామ్ మధ్య కథా చర్చలు నడిచాయని, ఈ సినిమా చేయడానికి సూర్య కూడా ఉత్సాహం చూపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుంది..!!
