in

Suriya 46 officially goes on floors with Venky Atluri

 

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన‌ ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి చిత్రబృందం హాజ‌రైంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇత‌ర నటీనటులు, మిగ‌తా యూనిట్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో క‌లిసి ప్ర‌ముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక‌, సూర్య తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ చిత్రం అంచనాలను అందుకోకపోవడంతో ఇప్పుడు సూర్య త‌న ఆశ‌ల‌న్నీ వెంకీపైనే పెట్టుకున్నారు. ఎందుకంటే వెంకీ అట్లూరి ఇటీవ‌ల ల‌క్కీ భాస్క‌ర్‌, సార్ వంటి వ‌రుస హిట్స్ ఇచ్చారు..!!

Bhagyashree Borse becomes the new crush for telugu people!