రామ నాయుడు గారు తమ సొంత బ్యానేర్ లో తీస్తున్న చిత్రంలో, వెంకటేష్ తాను ఆ క్యారెక్టర్ చేస్తాను అని ఉత్సాహం చూపిన కూడా, వెంకటేష్ గారిని కాదని, హీరో అవకాశాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వటం చాల మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానేర్ లో పూర్తి స్థాయి హాస్య చిత్రం చేయాలి అనుకోని, రామ నాయుడు గారు జంధ్యాల గారితో చెప్పటం జరిగింది. జంధ్యాల గారు ” సత్యం గారి ఇల్లు ” అనే ఆదివిష్ణు గారి నవలను రామ నాయుడు గారికి చెప్పారు, స్టోరీ నచ్చిన నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయాయి. హీరోగా ఎవరిని తీసుకుందాం అనుకున్నప్పుడు,
డిఫరెంట్ రోల్స్ చేయటంలో ముందు వరస లో ఉండే వెంకటేష్ గారు, తాను ఆ పాత్ర చేస్తాను అని ఇంటరెస్ట్ చూపించారట, కానీ నాయుడు గారు నీకు ఆ క్యారెక్టర్ సూట్ కాదు అని రిజెక్ట్ చేశారట. జంధ్యాల గారి సలహా మేరకు రాజేంద్ర ప్రసాద్ గారిని అందులోని కస్తూరి కృష్ణ మూర్తి పాత్ర కు తీసుకోవటం జరిగింది. ఆ చిత్రమే ” అహ నా-పెళ్ళంట !” , మనందరికీ తెలుసు ఆ చిత్రం ఎంత విజయవంతం అయింది. రామ నాయుడు గారి జడ్జిమెంట్ కి తిరుగు లేదని నిరూపించిన చిత్రం ” అహ నా -పెళ్ళంట!”