1976 లో పద్మాలయ సంస్థ నిర్మించిన చిత్రం ” రామరాజ్యం లో రక్తపాతం” సెన్సార్ వారి ఆంక్షల వలన ” రామరాజ్యం లో రక్తపాశం ” గ టైటిల్ మార్చవలసి వచ్చింది. హీరో కృష్ణ ద్విపాత్రాభినయం చేసి, నిర్మించిన చిత్రం రామరాజ్యం లో రక్తపాతం సినిమా పూర్తి అయింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు, పోస్టర్స్ వంటి పబ్లిసిటీ సామగ్రి అంత జిల్లాలకు చేరిపోయింది. సినిమా సెన్సార్ కి వెళ్ళింది, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ నిబంధనలకు అనుకూలంగా సెన్సార్ రూల్స్ కూడా సవరించారు. సినిమా పేరులో ఉన్న” రక్తపాతం ” అనే పదం తొలగించాలని సెన్సార్ వారు నిర్ణయించారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, సెన్సార్ వారు ఆ పదం తొలగిస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని తెగేసి చెప్పేసారు.
రిలీజ్ డేట్ రెండు రోజులే ఉంది చేసేదిలేక టైటిల్ కార్డు రీషూట్ చేసి, సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నారు. పబ్లిసిటీ పరిస్థితి ఏమిటి పోస్టర్స్ అన్ని ప్రింట్ అయిపోయాయి, జిల్లాలకు చేరిపోయాయి, ఏమి చేయాలో అర్ధం కాకా అందరు తలలు పట్టుకున్నారు. కృష్ణ గారు కూల్ గ ” రామరాజ్యం లో రక్తపాశం” అని స్టికర్ లు ప్రింట్ చేయించి అన్ని జిల్లాలకు పంపించి, డిస్ట్రిబ్యూటర్స్ కి థియేటర్ యజమానులకు అందించారు. పోస్టర్స్ లో టైటిల్ మీద ఈ స్టిక్కర్స్ అంటించి పబ్లిసిటీ చేసేసారు. సినీ పరిశ్రమ అంత కృష్ణ అనుకున్నారా, మజాకా అనుకున్నారా అని ముక్కున వేలేసుకున్నారు, అందుకే ఆయనను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనేది.