రాజకుమారుడు గ ఎంట్రీ ఇచ్చి, యువరాజు గ అమ్మాయిల మనసులు దోచిన కలల రాకుమారుడు మహేష్ బాబు. సినిమాలు ఎంపిక చేసుకోవటంలో ఎవరి మీద డిపెండ్ అవకుండా హిట్ అయినా ఫట్ అయిన తానే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ అని నిరూపుంచుకున్నారు మహేష్ బాబు. కెరీర్ ప్రారంభ దశలో తనకు నాలగవ చిత్రం అయిన “మురారి” కధ విన్న సూపర్ స్టార్ కృష్ణ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాచేయకు ఇది అట్టర్ ప్లాప్ అవుతుంది అని చెప్పారట.అప్పటికే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మహేష్ కు ఫామిలీ మేలో డ్రామా తో ఉన్న ఈ స్టోరీ సూట్ కాదని కృష్ణ గారి ఉద్దేశం. డిఫరెంట్ మూవీస్ చేయాలనే సంకల్పం తో , డైరెక్టర్ కృష్ణ వంశీ మీద ఉన్న నమ్మకం తో “మురారి” లో నటించారు మహేష్. చిత్ర నిర్మాణ సమయం లో ఎన్నో అడ్డంకులు, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి మధ్య మనస్పర్థలు ఇలా పూర్తి అయింది మురారి.
థియేటర్స్ లో రిలీజ్ అయింది ప్లాప్ టాక్, మహేష్ అభిమానులు డిసప్పోఇంట్ అయిపోయారు, ఫస్ట్ వీక్ థియేటర్స్ అన్ని ఖాళి, కానీ సెకండ్ వీక్ నుంచి మెల్లగా ఫామిలీ ఆడియన్స్ రావటం మొదలయింది కలెక్షన్స్ పుంజుకున్నాయి. హిట్ టాక్ మొదలయింది కొన్ని సెంటర్స్ లో వంద రోజులు, మరికొన్ని చోట 175 డేస్, హైదరాబాద్ లో ఒక థియేటర్ లో ఏకంగా 225 డేస్ నడిచింది మురారి. మహేష్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గ నిలిచింది మురారి. మనం ఒకటి తలిస్తే, దేవుడు ఇంకొకటి తలుస్తాడు అనేది సామెత, సినీ జనం ఒకటి తలిస్తే, ప్రేక్షక జనం ఇంకొకటి తలుస్తారు అనేది సినీ సత్యం. హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు ఫట్ అవటం, ఈ సినిమా ఫట్టే అనుకుంటే హిట్ అయి కూర్చున్న సినిమాలు కోకొల్లలు.