అక్కినేని గారి సినీ ప్రయాణం లో ఎన్నో మలుపులు, ఎన్నో అరుదయిన రికార్డులు ఉన్నాయి, నటుడిగా మరెవరికి సాధ్యం కానీ ఒక అరుదయిన రికార్డు కూడా ఆయన సాధించారు. ఒకే నెలలో విడుదల అయిన మూడు చిత్రాలు శత దినోత్సవం { 100 డేస్ } జరుపుకోవటం. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం ఏ సినిమా ఎంత వసూలు చేసింది అనేదే ముఖ్యం, ఎన్ని రోజులు ప్రదర్శితం అయింది అనేది ముఖ్యం కాదు, మారుతున్న మార్కెట్ ట్రెండ్ ని బట్టి అది కూడా మారిపోయింది. ఇక అక్కినేని గారి రికార్డు విషయానికి వస్తే, 1964 వ సంవత్సరం జనవరి 1 వ తారీఖున ” పూజ ఫలం” చిత్రం రిలీజ్ అయి విజయవంతం అయింది, రెండు కేంద్రాలలో 100 డేస్ రన్, అదే నెల 9 వ తారీఖున రిలీజ్ అయిన ” ఆత్మ బలం ” చిత్రం కూడా విజయవంతం అయి రెండు కేంద్రాలలో 100 డేస్ నడిచింది.
వీటన్నిటి మించి అక్కినేని గారి నట జీవితం లో కలికితురాయిగా నిలిచినఁ చిత్రం ” మూగ మనసులు” జనవరి 31 వ తారీఖున రిలీజ్ అయి విజయవంతం అవటమే కాదు ఏకంగ 27 సెంటర్స్ లో 100 డేస్ నడిచి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి మార్కెట్ కండిషన్ ని బట్టి ఒక హీరో నటించిన మూడు చిత్రాలు ఒకే నెలలో రిలీజ్ అవటం ఒక రికార్డు అయితే ఆ మూడు చిత్రాలు 100 డేస్ నడవటం మరో అరుదయిన రికార్డు. ప్రస్తుత పరిస్థితిల్లో 10 సంవత్సరాలలో వరుసగా మూడు హిట్స్ ఉంటె హ్యాట్రిక్ హీరో అంటారు, మరి అక్కినేని గారి రికార్డును ఏమనాలి? సూపర్ డూపర్ రెర్ వన్ అండ్ ఓన్లీ హ్యాట్రిక్ హీరో అక్కినేని అనాలేమో!