in

Sunil Getting Super Busy In kollywood now!

మెడియన్ గా ఒక స్టాంపు వేసుకున్న సునీల్ ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దాంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అరవింద సమేత సినిమా ద్వారా మళ్లీ తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఇక ఇప్పుడేమో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. పాత్ర విషయంలో ఎటువంటి కండిషన్స్ లేకుండా నటిస్తున్న ఈయన క్రేజ్ ఇప్పుడు తమిళ తంబీలలో కూడా పాకిపోయింది. అక్కడి జనాలు సునీల్ వెండితెరపై కనిపిస్తే..ఈలలు, గోలలతో రచ్చ చేస్తున్నారు. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో సునీల్ నటన అక్కడి బ్యాచ్ కి తెగ నచ్చేసింది అని చెప్పాలి.

అంతేకాదు వరుసగా అక్కడ అవకాశాలు అందుకుంటూ అక్కడి వారిని కూడా మడత పెట్టేస్తున్నారు సునీల్.ఇకపోతే వినాయక చవితికి రిలీజ్ కాబోతున్న మార్క్ ఆంటోనీ సినిమాలో కూడా సునీల్ పాత్ర మామూలుగా ఉండదని కోలీవుడ్లో వినిపిస్తోంది. కార్తీ జపాన్ లో కూడా సునీల్ కి మంచి పాత్ర లభించిందట. ఇవే కాకుండా ఈగై, బుల్లెట్ అనే మరో రెండు సినిమాలలో ఆయన కీలకపాత్రలో చేస్తున్నారు. మొత్తానికైతే తమిళ సినిమాలలో భారీగా పాపులారిటీ దక్కించుకున్నారు సునీల్..!!

will rashmika consider naga shourya?

hot beauty Disha Patani to make directorial debut!