రంగస్థలం లో మాదిరి ‘పుష్ప’లో అనసూయ చేస్తున్నది అంత కీలకమైన పాత్రేమీ కాదని సమాచారం. ఇందులో సునీల్ భార్యగా ఆమెకు మూణ్నాలుగు సీన్లు మాత్రమే కేటాయించారట. అవి తక్కువ నిడివితో ఉండేవని.. సినిమా మొత్తంలో ఐదారు నిమిషాలకు మించి ఆమె కనిపించదని సమాచారం. ఐతే ఇది కొన్ని రోజుల ముందు వరకు ఉన్న అప్డేట్. కానీ ఇప్పుడు వ్యవహారం మారిపోయింది. ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీంతో కథను మరింత విస్తరిస్తున్నారు. పాత్రలను పెంచుతున్నారు. అలా పెంచాలనుకున్న పాత్రల్లో అనసూయది కూడా ఒకటని సమాచారం. ఆమె కోసం కొత్త సన్నివేశాలు రాస్తున్నారని… కథలో ఈ పాత్రకు మరింత కీలకం చేస్తున్నారని తాజా సమాచారం. ఈ క్రమంలోనే సునీల్ పాత్ర సైతం పెరుగుతోందట. క్యామియో లాంటి రోల్ అయినప్పటికీ.. సుకుమార్ మీద గౌరవంతో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్న అనసూయకు ఇప్పుడు అనుకోని అదృష్టం వరించి సినిమాలో కీలకం కాబోతుండటం విశేషమే.