in

Sukumar Blown Away By ‘RRR’; Hails Rajamouli!

ళ్ల నిరీక్ష‌ణ ఫలించింది. ఎన్నాళ్లో వేచిన ఉద‌యం రానే వ‌చ్చింది. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి రూపొందించిన మెగా మూవీ ఆర్ఆర్ఆర్ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌న సినిమాల‌కు ఎంత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చినా.. అంత‌కుమించి ఔట్‌పుట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసే రాజ‌మౌళి మ‌రోసారి త‌న మాయాజాలాన్ని వెండితెర‌పై ప్ర‌ద‌ర్శించాడు. క‌థ విష‌యంలో కొంత అసంతృప్తి ఉన్నా.. త‌న‌కే సాధ్య‌మైన విజువ‌ల్ మాయాజాలంతో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగిస్తున్న జ‌క్క‌న్న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. సామాన్య ప్రేక్ష‌కుల నుంచి.. సెల‌బ్రెటీల వ‌ర‌కు జ‌క్క‌న్న‌ను గొప్ప‌గా కొనియాడుతున్నారు.

ఆ ప్ర‌శంస‌ల్లో కూడా ఒక‌టి చాలా ప్ర‌త్యేక‌మైందిగా చెప్పాలి. అది జ‌క్క‌న్న స‌హ‌చ‌ర స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన సుకుమార్ ఇచ్చిన కాంప్లిమెంట్‌. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చాలామంది సుదీర్ఘంగా పోస్టులు పెడుతున్నారు కానీ.. సుకుమార్ చాలా షార్ట్‌గానే జ‌క్క‌న్న గొప్ప‌ద‌నాన్ని త‌న కామెంట్ రూపంలో తెలియ‌జేశాడు..మీరు ప‌క్క‌నే ఉన్నా మిమ్మ‌ల్ని అందుకోవాలంటే ప‌రిగెత్తాలి. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మ‌ల్ని చూడాలంటే త‌లెత్తాలి..రాజ‌మౌళి సార్..మీకూ మాకూ ఒక‌టే తేడా..ఇలాంటి సినిమా మీరు తీయ‌గ‌ల‌రు మేం చూడ‌గ‌లం. అంతే..ఇదీ సూటిగా, సుత్తి లేకుండా సుకుమార్.. రాజ‌మౌళిని కొనియాడిన పోస్ట్.

master beauty Malavika Mohanan slams Media Portal!

WHERE IS DREAM BOY ABBAS?