లాక్ డౌన్ స్టార్ సత్యదేవ్, ఆఫ్ఘానిస్తాన్ లో తృటిలో ఆర్మీ కాల్పుల నుంచి తప్పించుకున్న రోమాంచితం అయిన ఒక సంఘటన జరిగింది. లాక్ డౌన్ స్టార్ అని ఎందుకు అన్నాను అంటే, లాక్ డౌన్ పీరియడ్ లో, ఓ.టి.టి . ప్లాట్ఫారం మొత్తం ఒక ఊపు ఊపేసిన ఉమా మహేశ్వరుడు కాబట్టి.” హబీబ్” అనే ఒక హిందీ సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘానిస్తాన్ వెళ్లారు సత్యదేవ్. వారికి షూటింగ్ పర్మిషన్ మంగళ వారం నుండి ఉన్నది, మన వాళ్ళు మంగళ వారం అంటే కొంచెం సెంటిమెంటల్ గ ఫీల్ అయి, జస్ట్ ఒక స్ట్రీట్ వాకింగ్ సీన్ సోమ వారం చేద్దాం, షూటింగ్ మొదలు పెట్టినట్లు అవుతుంది అని, కెమెరా కనిపించకుండా పెట్టి, మేకప్ లో అంటే గడ్డం, టోపీ, శాలువా కప్పుకున్న సత్యదేవ్ ఒక వీధిలో అటు,ఇటు తిరుగుతున్న షాట్ తీస్తున్నారు, అది అసలే సెన్సిటివ్ ఏరియా ఆ వీధిలో సత్యదేవ్ అటు, ఇటు అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన ఆర్మీ వారు సత్యదేవ్ ను చుట్టుముట్టేశారు. చేతుల్లో ఆటోమేటిక్ గన్నులతో చుట్టూ ముట్టి సత్యదేవ్ కు బేడీలు వేసేసారు, ఇతనేమో కంగారుగా హిందూస్తాన్, షూటింగ్ అని అనగానే వాళ్లకు ” షూటింగ్ “అన్న మాట మాత్రమే అర్ధం అయింది,వీడెవడు సూసైడ్ బాంబర్ అనుకున్నారు.
ఇంతలో ప్రక్కన ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఇండియా, ఫిలిం యాక్టర్ అనగానే, పాస్పోర్ట్ చూపించమన్నారట, అతను వంగి సాక్సులో ఉన్న, పాస్పోర్ట్ తీయటానికి ప్రయత్నించాడు, అంతే చుట్టూ ఉన్న గన్నుల సేఫ్టీ క్యాచ్లు ఓపెన్ అయ్యాయి, ఆ సౌండ్ కి వీళ్ళ ఊపిరి ఆగినంత పని అయ్యింది, చుట్టూ ఉన్న పబ్లిక్ సూసైడ్ బాంబర్లు అనుకోని రాళ్ళూ, బాటిళ్లు విసరటం మొదలెట్టారు. అక్కడ నుంచి తీసికొని వెళ్లిపోయారు, విషయం తెలుసుకొన్న డైరెక్టర్, ప్రొడ్యూసర్ వెళ్లి వాళ్ళ పాస్ పోర్టులు, షూటింగ్ పర్మిషన్ లెటర్ చూపించి కాళ్ళ వేళ్ళ పడి వీరిని బయటకు తీసుకొని వచ్చారట. లేకుంటే అనుమానాస్పద మృతుల జాబితా లో చేరిపోయి ఉండే వారు మన సత్యదేవ్, ఉమా మహేశ్వరుడిగా చూసే అవకాశం మనకు దక్కి ఉండేది కాదు. ఉగ్రవాద ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త గ ఉండటం అవసరం అనే ఒక గొప్ప జీవిత సత్యం తెలుసుకున్నారు మన సత్యదేవ్.,