in

Sudheer Babu’s pan india Supernatural Mystery Thriller!

అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించనుంది. వెంకట్ కల్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ‘ప్రేర‌ణ అరోరా’ స‌మ‌ర్ప‌ణ‌లో ఇప్పుడు సుధీర్ బాబు చేయ‌బోతున్న సినిమా పాన్ ఇండియా సూప‌ర్ నేచుర‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది. మేక‌ర్స్ ఆ వివ‌రాల‌ను త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చిలో విడుద‌ల చేయ‌నున్నారు.

చెడుకి, మంచికి జ‌రిగే యుద్ధంగా ఇది తెర‌కెక్క‌నుంది. ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ నాకు న‌చ్చడంతో ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ప్రేర‌ణ అరోరా, ఆమె టీమ్ స‌భ్యులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సులకు హ‌త్తుకుంటుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు..!!!

Dulquer salmaan to romance young Krithi Shetty?

deputy cm pawan: ‘og’ ante manalni kya ji antaru