పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. కానీ ప్రస్తుతం ఈ అమ్మడుకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆమె సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. దాంతో పూజా కెరీర్ డౌన్ అయింది. దీంతో ఈ అమ్మడు వెబ్ సిరీస్‌ల్లో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఇప్పుడు పూజా కూడా అదే బాటలో నడుస్తుందని టాక్ వినిపిస్తోంది..
ప్రస్తుతం సూర్య 44 సినిమా రెట్రోలో పూజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లల్లో నటించారు. ఇప్పుడు పూజా కూడా అదే బాటలో నడుస్తుందని టాక్. ఈ వెబ్ సిరీస్‌ను డిమాంటి కాలనీ, కోబ్రా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరి వెబ్ సిరీస్‌లలో అయినా పూజా రాణిస్తారేమో చూడాలి..!!