
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]వే[/qodef_dropcaps]ణు మాధవ్, పరిచయం అక్కర్లేని ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన కామిక్ టచ్ తొ తెలుగు ప్రజలను అలరిస్తూ వచ్చిన కమెడియన్. సినిమా అవకాశాలు తగ్గుముకం పట్టడంతో పాలిటిక్స్ లోకి కూడా వచ్చారు.
అయితే, గతకొద్ది నెలలుగా వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి తోడు ఇటీవల కిడ్నీ సమస్య కూడా రావడంతో ఈనెల 6న కుటుంబసభ్యులు ఆయన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పటిల్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఆయనకు డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారు. అయితే, మంగళవారం వేణుమాధవ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన్ని ఐసీయూలోకి మార్చారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన్ని డాక్టర్లు కాపాడలేకపోయారు.