
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఇ[/qodef_dropcaps] టీవల కాలంలో యాంకర్ ప్రదీప్ తనదైన సమయస్పూర్తి తో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో మంది గుండెల్లో మంచి చోటు సంపాదించుకున్నాడు.అయితే గత కొంత కాలంగా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.గతంలో హీరో ప్రదీప్ గా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులు వలన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఈ సారి ఆయన ఎలాంటి పోర్పాటు జరగకుండా మరో ప్రాజెక్ట్ ను సెట్ చేసుకున్నాడు అని అంటున్నారు.ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన యువకుడు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవరిస్తున్నాడు అని సమాచారం.ఈ సారైనా ఈ యంగ్ యాంకర్ హీరోగా తెర పై కనిపించి సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.