in

Srinidhi Shetty was approached for Sita’s role in Ramayana!

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని సెలెక్ట్ చేశారని.. కానీ, గతంలో కేజీయఫ్ చిత్రంలో యష్ పక్కన హీరోయిన్‌గా చేసి, ఇప్పుడు ఆయన రావణుడిగా, తాను సీతగా చేస్తే అభిమానులు అంగీకరించరని ఆమె ఈ సినిమాను తిరస్కరించిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి..

తాజాగా శ్రీనిధి శెట్టి ఈ వార్తలపై స్పందించింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. “నిజానికి రామాయణం కోసం నేను కూడా ఆడిషన్ ఇచ్చాను. అయితే, నేను సెలెక్ట్ కాలేదు. దీంతో ఆ పాత్ర సాయిపల్లవి చేస్తుంది. ఆమె అయితే, ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది..’’ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి రామాయణ చిత్రంలో శ్రీనిధి నటించకపోవడంపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తోంది..!!

Ameesha Patel reveals why she is single at 50

Ameesha Patel reveals why she is single at 50

dragon beauty kayadu lohar clarifies about fake posts!