in

Srinidhi Shetty Clarifies Relationship with Anushka Shetty!

న తొలి చిత్రం ‘కేజీఎఫ్’ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. కన్నడ స్టార్ యశ్ సరసన నటించిన ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో… ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో వెంకటేశ్ సరసన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరోవైపు, శ్రీనిధి శెట్టికి మరో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బంధువు అంటూ కొంత ప్రచారం జరుగుతోంది. దీనిపై శ్రీనిధి స్పందిస్తూ..తాము బంధువులం కాదని స్పష్టం చేశారు. కానీ ఎక్కడో ఒకచోట బంధువులం అయి ఉండొచ్చని అన్నారు. తాను ఇప్పటి వరకు అనుష్కను కలవలేదని చెప్పారు. అయితే, అనుష్క గురించి తాను చాలా విన్నానని..ఆమె చాలా డౌన్ టు ఎర్త్ అని, ఆమెకు హెల్పింగ్ నేచర్ ఎక్కువని, దయాగుణం ఉందని తెలిపారు. ఆమెను కలవాలనే కోరిక తనకు ఉందని చెప్పారు..!!

23 years for ‘nuvvu leka nenu lenu’!

Anasuya Bhardwaj gets emotional about her Health Update!