బాహుబలి సినిమా టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 100 కోట్లు పైగా మార్కెటింగ్ చేసి అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కొరటాల శివను కూడా ఒక స్టార్ దర్శకుడిగా ఇండస్ట్రీలో నిలబెట్టింది. అయితే విజయం వెనక వివాదాలు వస్తాయి అన్నట్లు అప్పటినుంచే కొరటాల శివ కి శ్రీమంతుడి విషయంలో ఒక వివాదం ఎదురైంది. ఆ సినిమా తన పుస్తకానికి కాపీ అంటూ శరత్ చంద్ర అనే ఒక రైటర్ అప్పట్లో కేసు వేశాడు. ఇప్పటికీ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.
తాజాగా ఆ కేసు మరోసారి తెరపైకి వచ్చింది..కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు సినిమా మొత్తం సీన్ టు సీన్ కాపీ అని, ఆ సినిమాలో ఏదైనా డిఫరెన్స్ ఉంది అనంటే దేవరకొండ అనే ప్లేస్ కి బదులు దేవరకోట అనే పేరును సినిమాలో ఉంచడం తప్ప మిగతా సీనులన్నీ కాపీ అంటూ చెప్పుకొచ్చాడు శరత్ చంద్ర. అయితే ఈ సినిమా కాపీ విషయంలో తనకు దాదాపుగా 15 లక్షల వరకు ఇస్తారన్న కానీ తనకు ఓనర్ షిప్ కావాలని లేకుంటే కొరటాల శివ జైలుకి వెళ్ళడం తప్పదని శరత్ చంద్ర డిమాండ్ చేశాడు..!!