సినిమాల్లో డూప్ అనేది కూడా చాలా ముఖ్యం.. ముఖ్యంగా రిస్క్ షాట్లలో, ఫైటింగ్ సీన్స్‌లలో డ్యూయల్ రోల్స్ అవసరం ఉన్నప్పుడు డూప్‌ని కచ్చితంగా వాడుతుంటారు దర్శకులు. అయితే ఇది కేవలం హీరోలకి మాత్రమే హీరోయిన్లకి కూడా డూప్‌లను వాడుతుంటారు. హీరోయిన్స్‌కి ఎక్కువగా డ్యూయల్ రోల్ చేసినప్పుడు మాత్రమే డూప్‌ని వాడుతుంటారు. అయితే అలాంటి సందర్భం ఓ సారి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవికి డూప్ కావాల్సి వచ్చింది.
శ్రీదేవి ఈత కొలనులో ఉంటే.. అమ్రిష్ పురి వచ్చే సీన్ ఉంటుంది. అప్పటికి శ్రీదేవికి ఈత రాకపోవడంతో ఆ సమయంలో ఈత వచ్చిన అమ్మాయి అవసరం ఏర్పడింది. ఆ టైంలో ఊటీలో మరో సినిమా షూటింగ్‌లో ఉన్న హేమను తీసుకువచ్చి శ్రీదేవికి డూప్‌గా నటింపజేశారు. లాంగ్ షాట్‌లలో చూస్తే హేమ కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత శ్రీదేవి- హేమ కలసి ‘క్షణం క్షణం’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో హేమ.. శ్రీదేవి స్నేహితురాలుగా నటించింది. ఆ తర్వాత హేమ బిజీ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది.