in

Sreeleela’s fans wondered if she was getting married!

యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంగేజ్ మెంట్ చేసుకుందా..ఆ ఫొటోలకు అర్థమేంటి.. నిజంగానే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందా..ఈ రోజు ఉదయం నుంచే ఇదే ట్రెండింగ్. శ్రీలీల తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. కానీ అందులో కొందరు పసుపు పెడుతూ ఆశీర్వదిస్తున్నట్టు ఉంది. పైగా దానికి బిగ్ డే.. కమింగ్ సూన్..పూర్తి వివరాలు త్వరలో చెబుతా అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఇంకేముంది అవి చూసిన వారందరూ నిజంగానే శ్రీలీల ఎంగేజ్ మెంట్ అయిపోయిందేమో అంటూ తెగ కంగారు పడిపోయారు. కానీ అసలు విషయం వేరే ఉంది..

నిన్న శ్రీలీల పుట్టిన రోజు. వాళ్ల సంప్రదాయం ప్రకారం పెద్ద వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అందుకే శ్రీలీల తమ బంధవులు, ఇండస్ట్రీలోని కొందరిని పిలిచి శ్రీలీలకు ఇలా ఫంక్షన్ జరిపించింది. ఇందులో వారు పసుపు పెట్టి ఆమెను ఆశీర్వదించారు. అంతకు మించి ఇంకేం లేదు. కానీ అది చూసిన వారందరు మాత్రం నిజంగానే శ్రీలీల ఎంగేజ్ మెంట్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. శ్రీలీల ఇప్పుడిప్పుడే మళ్లీ వరుస ఛాన్సులు దక్కించుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ మూవీ చేస్తోంది. అలాగే టాలీవుడ్ లో రెండు సినిమాలు, కోలీవుడ్ లో ఒకటి చేస్తోంది..!!

Rashmika reveals she didn’t want to be an actress!

Cricketer Chahal’s ex wife Dhanashree Verma debut in Tollywood!