నితిన్, శ్రీలీలన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా హీరోయిన్ శ్రీలీలా విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
నిజానికి ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ అవకాశం తనకు వచ్చిందని శ్రీలీలా చెప్పుకొచ్చింది. కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఓకే చెప్పానని తెలిపింది. ఇక గతేడాది వరుసగా సినిమాల విడుదలతో చాలా బిజీగా గడిచిందన్న బ్యూటీ, రోజుకు 4-5 షిఫ్ట్‌ల వరకు పని చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది. అయితే మెడిసిన్ ఫైనల్ ఇయర్ పూర్తయ్యే సమయానికి ఒక ఏడాది బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది..!!