in

Sreeleela To Pair Up With bollywood hero Kartik Aaryan Again!

 

క హీరోయిన్‌, ఒకే హీరోతో వరుస సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది హీరోయిన్లు ఇలా చేశారు కూడా. అయితే ఓ సినిమా సెట్స్‌ మీద ఉండగానే.. అదే కాంబినేషన్‌లో మరో సినిమా సెట్‌ అవ్వడం అంటే పెద్ద విషయమే. ఇప్పుడు అదే జరుగుతోంది బాలీవుడ్‌లో. ఆ హీరోయిన్‌ శ్రీలీల అయితే, ఆ హీరో కార్తిక్‌ ఆర్యన్‌. బాలీవుడ్‌లో మోస్ట్‌ ప్రామిసింగ్‌ హీరోగా పేరు గాంచిన కార్తిక్‌ ఆర్యన్‌ – శ్రీలీల ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. ‘ఆషికీ’ స్టైల్‌ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది అని సమాచారం..

అనురాగ్‌ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమానే ‘తు మేరి జిందగీ హై’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మరో సినిమాకు సర్వం సిద్ధమైందంటున్నారు. ‘చందు ఛాంపియన్‌’ సినిమా దర్శకుడు కబీర్‌ ఖాన్‌తో కార్తిక్‌ ఓ సినిమా చేయనున్నారు అని వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ సినిమా ప్రకటిస్తారు అని కూడా అంటున్నారు. ఆ సినిమాలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారని సమాచారం. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న కబీర్‌ ఖాన్‌ సినిమాలో కార్తిక్‌ కిక్‌ బాక్సింగ్‌ కోచ్‌ పాత్రలో కనిపిస్తాడట…!!

Bellamkonda Srinivas about romantic scenes with Samantha!

Lavanya Tripathi files complaint against online abuse!