
2009లో వచ్చిన ‘అరుంధతి’ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది కెరియర్లు సెట్ చేసిన సినిమా అది. అనుష్కని స్టార్ గా మార్చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని భారీ బడ్జెట్ తో తీయొచ్చన్న భరోసాని కలిగించింది. ఇన్నాళ్లకు ఈ సినిమా హిందీలో రీమేక్ చేయబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. అల్లు అరవింద్ ఈ సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్లబోతున్నార్ట. అనుష్క స్థానంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుందన్నది ఓ టాక్. ‘ఛత్రపతి’ సినిమా కూడా ఇలానే చేశారు. ఆ సినిమా బాలీవుడ్ లో చాలా లేటుగా రీమేక్ చేశారు. అప్పటికే టీవీల్లో హిందీ డబ్బింగ్ చూసేసిన బాలీవుడ్ జనాలు, ఈ స్ట్రయిట్ హిందీ సినిమాని తిరస్కరించారు. అదే పొరపాటు ‘అరుంధతి’ విషయంలోనూ జరుగుతుందేమో అన్నది బెంగ..!!
 
					 
					