
శ్రీలీల ఈ వారం తన కొత్త పొలిటికల్ హిస్టారికల్ డ్రామా సినిమా ‘పరశక్తి’తో అలరించబోతోంది. ఈ సినిమా జనవరి 10, 2026న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకి ముందు, నటి తన కెరీర్, డ్యాన్స్ నంబర్లు, ఇటీవలి విజయాలు గురించి మనసు విప్పి మాట్లాడుతోంది. గాలాటా ప్లస్‌తో మాట్లాడుతూ, శ్రీలీల ‘పుష్ప 2’లో చేసిన ప్రత్యేక డ్యాన్స్ నంబర్ తన కెరీర్‌లో భాగం కాదని అన్నారు. నివేదిక ప్రకారం, ‘ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌లు చేయడం నా పని కాదు..
కానీ పుష్ప 2 కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ఇది నాకు చాలా గుర్తింపునిచ్చింది. సాధారణంగా నేను పూర్తిస్థాయిలో నటించిన సినిమాల్లోనే డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతాను, ఇతర ప్రాజెక్ట్‌లలో కాదు.’ అని అన్నారు. ‘పరశక్తి’లో తన పాత్రకు అనుగుణంగా తేలికపాటి డ్యాన్స్ నంబర్‌లు మాత్రమే ఉన్నాయని నటి వెల్లడించింది. అంత పెద్దగా డ్యాన్స్‌లు లేకపోయినా మంచి డ్యాన్స్‌లు ఉన్నాయని తెలిపింది. ‘పరశక్తి’ శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు..!!

