సప్త సాగరాలు దాటి’ సినిమా చూసినవారు, అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంది అనుకున్నారు. ఈ మధ్య కాలంలో చీరకట్టులో ఇంత అందంగా ఉన్న హీరోయిన్స్ ను చూడలేదని చెప్పుకున్నారు. అయితే ఈ అమ్మాయి చీరకట్టులోనే బాగుంటుందనే అభిప్రాయాలు పెరుగుతూ ఉండటంతో, ఆ ముద్ర నుంచి బయటపడటానికి .. గ్లామరస్ గా మెరవడానికి రుక్మిణి ప్రయత్నం చేస్తూ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ ఆమె ముచ్చట తీర్చింది. ఈ సినిమాలో యువరాణి పాత్రలో ఆమె గ్లామర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిల్చి వేస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడతో పాటు, తెలుగు..తమిళ భాషల్లో ఆమెకి ఆఫర్లు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు ఆడియన్స్ మాత్రం వెంకటేశ్..పవన్ కల్యాణ్ .. ప్రభాస్ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికగా ఈ బ్యూటీ సరిగ్గా కుదురుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు. త్వరలోనే వారి ముచ్చట తీరుతుందేమో చూడాలి..!!