in

Sreeleela Replaces Jhanvi Kapoor in Dostana 2

టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో పాటు చలాకీతనంతో యువతను ఆకట్టుకుంటున్న శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్ వైపు తన అడుగులు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఒక హిందీ సినిమాలో నటిస్తున్న శ్రీలీల… ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2‘ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం..

చిత్రంలో నేషనల్ అవార్డు గ్రహీత విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్నారు. వాస్తవానికి, ఈ పాత్ర కోసం ముందుగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. దీంతో ఆ అద్భుత అవకాశం శ్రీలీలను వరించినట్టు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై నిర్మాత కరణ్ జొహార్ తుది చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది..!!

Rukmini Vasanth clears all doubts over ntr’s dragon!