తాజాగా శర్వానంద్ తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో శతమానం భవతి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలోనే మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుందనే విషయం తెలియగానే సినిమా పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది..
ఇక ఈ సినిమా విషయంలో మరొక స్టార్ హీరోయిన్ శ్రీ లీల దారుణంగా శర్వానందును అవమానించారని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కంటే కూడా ముందుగానే శ్రీ లీలను సంప్రదించారట. కాకపోతే ఇటీవల శర్వానంద్ వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కోవడంతో ఆయనతో కలిసి సినిమాలలో నటించడానికి ఇష్టపడలేదని అందుకే రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.!!