శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు. ఈ చిన్నది ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఎంతోమంది అభిమానుల చూపును తన వైపుకు తిప్పుకుంది. శ్రీలీల ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానుల ముందుకు వస్తూనే ఉంది. ఇదిలా ఉండగా..తాజాగా ఈ చిన్నది 30 ఏళ్లు దాటే వరకు వివాహం చేసుకోవాలని తేల్చి చెప్పింది..
తనకు ఇప్పుడు కేవలం 24 సంవత్సరాలేనని ఇప్పుడే అబ్బాయిల జోలికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల చెప్పారు. ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నానని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా కూడా మా అమ్మ నా వెంటనే వస్తుంది. మా అమ్మ నా వెంట ఉన్నప్పుడు నేను ఎలా ప్రేమలో పడతాను. US వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ నా వెంటనే వస్తుంది. అయినా కూడా నా పైన అనేక రకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి అంటూ శ్రీ లీల అన్నారు. ప్రస్తుతం ఈ చిన్నది షేర్ చేసుకున్న ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి..!!